తెలంగాణ వీణ , హైదరాబాద్ : ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు రేపు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం ఉదయం 8.30 గంటలకు మజ్లిస్ పార్టీ నుంచి గెలిచిన అక్బరుద్దీన్ ఒవైసీ ప్రొటెం స్పీకర్‌గా రాజభవన్‌లో ప్రమాణం చేయనున్నారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. అక్బరుద్దీన్‌తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆ తర్వాత ఉదయం 10:30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. కొత్తగా ఎన్నికైన సభ్యులతో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయించి… స్పీకర్‌ను ఎన్నుకునేంత వరకు ప్రొటెం స్పీకర్ సభను నిర్వహిస్తారు. నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు సాగనున్నాయి.