తెలంగాణ వీణ , హైదరాబాద్ : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జారిపడి గాయమైందని తెలిసి బాధపడ్డానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కేసీఆర్ త్వరగా… సంపూర్ణంగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. అనారోగ్య పరిస్థితులను మనోధైర్యంతో కేసీఆర్ అధిగమించాలన్నారు. కేసీఆర్ కోలుకొని ప్రజలకు సేవ చేస్తారని ఆకాంక్షించారు. కాగా, మాజీ సీఎం కేసీఆర్ అర్ధరాత్రి కాలుజారి కిందపడిన విషయం తెలిసిందే. ఆయనను యశోద ఆసుపత్రిలో చేరారు. కేసీఆర్ ఎడమ కాలు తుంటి ఎముక మార్పిడి చేయాలని డాక్టర్లు తెలిపారు.