తెలంగాణ వీణ , జాతీయం : 2024లో ముఖ్యమైన 10 ప్రయోగాలు చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం రాజ్యసభకు వెల్లడించిందిఇందులో 6పీఎస్‌ఎల్వీ ప్రయోగాలతోపాటు 3జీఎస్‌ఎల్వీ, ఒక లాంచ్ వెహికల్ మార్క్-3 మిషన్ ఉన్నట్లు తెలిపిందిరోదసిలోకి సొంతంగా వ్యోమగాములను పంపేందుకు ‘గగన్‌యాన్’ పేరిట భారత్ ప్రతిష్ఠాత్మక మిషన్‌ను చేపడుతున్న విషయం తెలిసిందే. అత్యవసర పరిస్థితుల్లో గగన్‌యాన్‌లోని వ్యోమగాములు సురక్షితంగా బయటపడేందుకు వీలుగా అభివృద్ధి చేసిన ‘క్రూ ఎస్కేప్ సిస్టమ్’ను ధ్రువీకరించేందుకు మరో ప్రయోగం చేపట్టనున్నట్లు మంత్రి వివరించారు.