తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : అత్తారింటికి దారేది అంటే చెప్పొచ్చు కానీ.. ఆంధ్రప్రదేశ్ రాజధానికి దారేది అంటే చెప్పలేం అంటూ ఇటీవల పవన్ కల్యాణ్ చేసిన విమర్శలకు మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కౌంటర్ ఇచ్చారు. పవన్‌కు ముగ్గురు అత్తగార్లు, అందుకే దారుల కన్ఫ్యూజన్ అంటూ సెటైర్లు వేశారు. ఇప్పుడు నాలుగవ దారి వెతుకుతున్నారంటూ వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఫలితాల తర్వాత జనసేనకు తగిలిన దెబ్బకు మతి చలించినట్టు కనిపిస్తోందన్నారు. ఓట్లను సాధించడంతో బర్రెలక్కతో జనసేన పోటీపడిందని, డిపాజిట్లు కూడా రాలేదు అంటూ కౌంటర్ ఇచ్చారు అమర్‌నాథ్. పవన్ కళ్యాణ్‌ది ఏ నియోజకవర్గమో చెప్పాలని డిమాండ్ చేశారు. స్థాయిని మరిచి అబ్రహం లింకన్ గురించి మాట్లడం సరికాదన్నారు అమర్‌నాథ్. పొలిటికల్ కాంట్రాక్టుల కోసం పుట్టిన పార్టీ జనసేన అని ఎద్దేవా చేశారు.