తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరిన మాజీ ముఖ్యమంత్రి పంట నష్టపోయిన రైతులను పరామర్శించి ధైర్యం చెప్పారు. నేడు తెనాలి, వేమూరు, బాపట్ల నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. రాత్రికి బాపట్లలోనే బస చేస్తారు.
పర్యటనకు వెళ్తూ దారిలో దేవేంద్రపాడు వద్ద నిరసన చేస్తున్న రైతులను చూసి ఆగి వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా రైతులు ఆయనతో తమ ఆవేదనను పంచుకున్నారు. పంట నష్టం అంచనాకు ప్రభుత్వం ఇంతవరకు రాలేదని చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రైతులను ఓదార్చారు.