తెలంగాణ వీణ , హైదరాబాద్ : గురువారం అర్ధరాత్రి తన నివాసంలో కాలు జారి కింద పడిపోయారు. దీంతో కేసీఆర్ను వెంటనే సోమాజీగూడలోని యశోధ దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆయన కాలు తుంటి ఎముక విరిగినట్లు గుర్తించారు. ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం హిప్ రీప్లేస్మెంట్ చేయనున్నారు. ప్రస్తుతం కేసీఆర్ వద్ద ఆయన సతీమణి శోభ, ఎంపీ సంతోశ్ కుమార్ ఉన్నారు.
దవాఖానలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేతను మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి పరామర్శించారు. అయితే కేసీఆర్ ఆరోగ్యంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు స్వల్ప గాయమైందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు. త్వరలోనే కోలుకుంటారన్నారు. కేసీఆర్పై ప్రజల ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలియజేశారు. కాగా, కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ప్రార్థించారు. ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు