తెలంగాణవీణ, కీసర : నాగారం మున్సిపల్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా వెలుస్తోన్న అక్ర మ నిర్మాణాలపై తగిన చర్యలు తీసుకోవాలని పిర్యాదులు చేసినా పట్టించుకోవటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.నాగారం నుంచి రాంపల్లి వెళ్లే ప్రధాన రహదారి పక్కనే నిబంధనలను ఉల్లంఘించి సెల్లార్ తో పాటు అదనపు అంతస్తుల నిర్మాణాన్ని చేపడుతున్నా పట్టించుకోవటం లేదని స్థానికులు ఆరొపిస్తున్నారు. మున్సిపల్ పరిధిలో నిబంధనలను ఉల్లంఘించి చేపడుతున్న నిర్మాణాలు, ఆదనపు అంతస్తుల భవనాలు, బారీ షెడ్ల నిర్మాణాలు విచ్ఛల విడిగా కొనసాగుతునే ఉన్నాయి. అధికారులు, ప్రజా ప్రతినిధుల అండదండలతోనే నిర్మాణాలు కొనసాగుతున్నాయని స్థానికులు బహిరంగంగానే ఆరొపిస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదని స్థానికులు వాపోతున్నారు. నాగారం నుంచి రాంపల్లికి వెళ్లే ప్రదాన రహాదారిపక్కనే తీసుకున్న అనుమతులకు చేపడుతున్న నిర్మాణానికి ఏలాంటి సంబంధం లేకుండా ఇష్టానుసారంగా నిర్మాణం పనులు జరుగుతున్నాయని నిర్మాణ దిశలోనే స్థానిక బీజేపీ నాయకులు కందాడి సత్తిరెడ్డి ఫిర్యాదు చేశారు.
సర్వే నెంబరు 146,147 లోని ప్లాట్ 110 పార్టులో సుమారు 150 గజాల స్థలానికి అనుమతులు తీసుకుని సెల్లార్ నిర్మాణంతో పాటు రెట్టింపు స్థాయిలో నిర్మాణ పనులు చేపడుతున్నారనీ భవన నిర్మాణ దశలో ఫిర్యాదు చేశారు. అయితే అధికారులు మాత్రం నిర్మాణం పూర్తియిన తర్వత తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని చేతులు దులుపుకున్నారు. సెల్లార్ నిర్మాణంతో నాటు భవన నిర్మాణపనులు నిబంధనలను ఉల్లంఘించి సదరు నిర్మాణదారులు యథేచ్చగా నిర్మాణ పనులను పూర్తి చేసిన అనంతరం గొడలను, స్లాబ్ లపై రంధ్రాలు చేసి తూతూ మంత్రంగా కూల్చివేతలు చేపట్టి చేతులు దులుపుకున్నారు. అయితే స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతోనే ఇక్కడి నిర్మాణ పనులు పూర్తయినట్లు పలువురు ఆరొపిస్తున్నారు. అంతే కాకుండా మున్సిపల్ పరిధిలో బారీ షెడ్ల నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరొపనలున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మున్సిపల్ పరిధిలో వెలుస్తోన్న అక్రమ నిర్మాణాలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.