తెలంగాణ వీణ , హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముఖ్య కార్యదర్శిగా శేషాద్రిని నియమించారు. మరోవైపు ఇంటెలిజెన్స్ ఐజీగా శివధర్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ గెలిచిన సమయంలోనే పలువురు అధికారులు, కార్పోరేషన్ చైర్మన్లు రాజీనామా చేశారు. తాజాగా సీఎం ముఖ్య కార్యదర్శిగా శేషాద్రిని, ఇంటెలిజెన్స్ఐజీగా శివధర్ రెడ్డిని నియమించారు. రేవంత్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం 1.04 గంటల సమయానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సచివాలయానికి బయలుదేరారు.