తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం రేపు ఉదయం 10.28 గంటలకు ఆయన ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంది. అయితే, సమయంలో స్వల్ప మార్పు చేశారు. మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. మరోవైపు, ప్రమాణస్వీకార కార్యక్రమం కోసం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే వంటి అగ్రనేతలతో పాటు పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు తరలి రానుండటంతో పటిష్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేస్తున్నారు.