తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఇంట్లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆమె కుమారుడు రాజారెడ్డి వివాహం జరగబోతోందని చెపుతున్నారు. రాజారెడ్డి అమెరికాలోని డల్లాస్ లో ఉన్నత విద్యను పూర్తి చేసుకుని హైదరాబాద్ కు తిరిగి వచ్చాడు. అమెరికాలో తనతో పాటు చదువుకున్న అమ్మాయిని ప్రేమించాడని, నాలుగేళ్లుగా వీరు ప్రేమలో ఉన్నారని సమాచారం. ఆ అమ్మాయి పేరు ప్రియ అట్లూరి అని, ఆమె కమ్మ సామాజికవర్గానికి చెందినదని చెపుతున్నారు. వీరి వివాహానికి ఇరు కుటుంబాలు ఓకే చెప్పాయని… వచ్చే ఏడాది మే లో వీరి వివాహం జరగబోతోందని సమాచారం. రాజారెడ్డి, ప్రియకు సంబంధించిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రియ చూడ్డానికి చాలా అందంగా, హీరోయిన్ లా ఉందని నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే వీరి పెళ్లిపై షర్మిల ఇంకా స్పందించాల్సి ఉంది.