తెలంగాణ వీణ , సినిమా : బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘అఖండ’ … బాలకృష్ణ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా నిలిచింది. మాస్ యాక్షన్ ను లింక్ చేస్తూ ఫ్యామిలీ డ్రామాను నడిపించడంలో బోయపాటికి మంచి పేరు ఉంది. వాటికి తోడు ఈ కథలో దైవశక్తిని కూడా యాడ్ చేయడం మరింతగా కలిసొచ్చింది.
ఆ సినిమా తరువాత బోయపాటి చేసిన ‘స్కంద’ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అందువలన ఆయన ‘అఖండ 2’కి సంబంధించిన కథను రెడీ చేసుకుంటున్నాడని అంటున్నారు. ‘అఖండ’లోని పాయింటును పట్టుకునే సీక్వెల్ కూడా ముందుకు వెళుతుంది. ఈ విషయాన్ని గతంలోనే బోయపాటి చెప్పాడు.