తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటన వాయిదాపడింది! ఈరోజు మధ్యాహ్నం… కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తుందని భావించారు. వివిధ అంశాల కారణంగా ప్రకటన జరగలేదు. అయితే సీఎం అభ్యర్థి ప్రకటన, ఎన్నికల ఫలితాలను సమీక్షించేందుకు కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సహా నలుగురు పరిశీలకులను ఆ పార్టీ అధిష్ఠానం ఢిల్లీకి పిలిపించుకుంది. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ నేడు సాయంత్రం ఢిల్లీకి బయలుదేరారు. రేపు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో చర్చలు జరిపి సీఎల్పీ నేతను ఎంపిక చేయనున్నారు. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి, ఏ నేతకు ఏ పోర్ట్‌పోలియో ఇవ్వాలో కూడా చర్చించనున్నారు.