తెలంగాణ వీణ , హైదరాబాద్ : బిగ్ బాస్ సీజన్ 7 చివరిదశకి చేరుకుంటోంది. ప్రస్తుతం హౌస్ లో ఉన్న సభ్యులు ఫైనల్స్ దిశగా వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రైజ్ మనీగా 50 లక్షలను గెలుచుకుంటే ఏం చేయాలనుకుంటున్నారనే ప్రశ్న నిన్న వారికి ఎదురైంది. అందుకు ఎవరికి వారు, తమ
మనసులోని మాటను చెబుతూ వెళ్లారు.
అమర్ దీప్ .. శోభ .. ప్రియాంక సొంత ఇంటికోసం ఆ డబ్బును ఉపయోగించుకుంటామని చెప్పారు. తమ కుటుంబ ఆర్ధిక పరిస్థితులను గురించి వివరించారు. కొంత తన ఫ్యామిలీ కోసం .. మరికొంత ఛారిటీ కోసం వాడతానని అర్జున్ అన్నాడు. తాను గెలుచుకుంటే .. అప్పుడు చెబుతానని శివాజీ సమాధానమిచ్చాడు.