తెలంగాణ వీణ , సినిమా : టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ మైసూరులోని చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ప్రస్తుతం రామ్ చరణ్ తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’ మైసూరులో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర బృందంతో కలిసి ఆలయానికి చరణ్ వెళ్లారు. ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరోవైపు, తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసేందుకు చరణ్ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి హైదరాబాద్ కు వచ్చారు. ఓటు వేసిన తర్వాత ఆయన మళ్లీ షూటింగ్ కోసం మైసూరుకు వెళ్లిపోయారు.