తెలంగాణ వీణ , జాతీయం : వారణాసిలోని జ్ఞానవాపీ మసీదు శాస్త్రీయ సర్వేను పూర్తి చేసి నివేదిక సమర్పించడానికి స్థానిక జిల్లా కోర్టు గడువును పెంచింది. మరో 10 రోజుల్లో నివేదికను సమర్పించాలని భారత పురావస్తు శాఖకు సూచించింది.
ఈ సందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ పురావస్తు శాఖ అధికారులు ఈ సారి సమయపాలన పాటిస్తారని, మళ్లీ గడువు పెంచాలని కోరబోరని భావిస్తున్నామని న్యాయమూర్తి ఏకే విశ్వేశ్ పేర్కొన్నారు.