తెలంగాణ వీణ , మెదక్ : జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎం బాక్సుల్లో భద్రంగా ఉంది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు తమ ఓటు హకును వినియోగించుకోవడానికి పోటెత్తారు. గ్రామాల్లో ఉదయం నుంచి పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటర్లు బారులు తీరారు. జిల్లాలో 86.69 శాతం ఓటింగ్ నమోదైంది.
మెదక్ నియోజకవర్గంలో 85.3 శాతం, నర్సాపూర్ నియోజకవర్గంలో 88.04 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలో అత్యధికంగా జిల్లాలోనే పోలింగ్ నమోదు కావడం విశేషం. ఓటుహకు వినియోగించుకునేందుకు నగరాల్లో ఉండేవాళ్లు పల్లెబాట పట్టారు. ప్రముఖులంతా తమ ఓటు హక్కును క్యూలో నిలబడి వినియోగించుకున్నారు. మెదక్ బీఆర్‌ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి కోనాపూర్‌లో తన ఓటుహక్కును వినియోగించుకున్నారు.