తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణ ప్రజల ఆశీర్వాదం తమకే ఉన్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. ఇప్పటికే తెలంగాణను సాధించి రికార్డు సృష్టించిన సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సీఎంగా మరో చరిత్ర సృష్టించబోతున్నారని తెలిపారు. రాష్ట్రంలో మంచి వాళ్లు ఉండాలని, మంచి చేసినోళ్లే ఉండాలని గురువారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు భావించారని పేర్కొన్నారు. గురువారం జూబ్లీహిల్స్‌లో ఉన్న పెద్దమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె విలేకరులు మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పింక్ వేవ్ వచ్చిందని చెప్పారు.