తెలంగాణ వీణ , సినిమా : తెలంగాణలో ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు క్యూకడుతున్నారు. పలువురు ప్రముఖులు ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటు వేశారు. నటుడు ఎన్టీఆర్ కుటుంబంతో కలిసి వచ్చి జూబ్లీహిల్స్ ఓబుల్‌రెడ్డి పబ్లిక్ స్కూల్‌లో ఓటు వేశారు. సినీనటుడు అల్లు అర్జున్..జూబ్లీహిల్స్‌లోని బీఎస్ఎన్ఎల్ పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. అందరితో పాటూ లైన్లో నిలబడి ఓటు వేసి వెళ్లారు. షాద్ నగర్‌లో సినీనటుడు ప్రకాష్ రాజ్ ఓటేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఓటుహక్కును వినియోగించుకున్నారు.