తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణ ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె వీడియో ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఈ మేరకు ఆమె తెలుగులోనే విజ్ఞప్తి చేయడం గమనార్హం. ‘ఓటర్లందరికీ నమస్కారం.. తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో అందరు ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నాను. ఓటు వేయడం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో అత్యంత ప్రాధాన్యత కలిగిన హక్కు అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మరీమరీ కోరుతున్నాను’ అని పేర్కొన్నారు.