తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణ భవన్ వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. తెలంగాణ భవన్‌లో దీక్ష దివస్ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో అక్కడికి ఎన్నికల కమిషన్ స్వ్కాడ్ టీమ్ చేరుకుని కార్యక్రమాలను నిలిపివేయాలని కోరింది దీంతో, ఇది కొత్త కార్యక్రమం కాదని.. ఎప్పటి నుంచో జరుపుతున్నామని బీఆర్‌ఎస్ నేతలు తెలిపారు. అయితే, ఈ కార్యక్రమాన్ని భవన్ లోపలే జరుపుకోవాలని అధికారులు సూచించారు. దీంతో, కొంత ఉద్రిక్తత చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.
వివరాల ప్రకారం.. తెలంగాణ భవన్‌లో దీక్ష దివస్ కార్యక్రమం జరుగుతోంది. తెలంగాణ ఉద్యమంలో భాగంగా నవంబర్ 29వ తేదీన కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అనే నినాదం ఇచ్చారు. అందుకే ఈరోజున దీక్ష దివస్ పేరుతో బీఆర్‌ఎస్ నేతలు కార్యక్రమం జరుపుతున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు తెలంగాణ భవన్‌లో కార్యక్రమం జరుగుతోంది.