తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణ ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. రాజకీయ అంశాలతోపాటు వర్తమాన విషయాలు, నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటారు. ఆపదలో ఉన్న వారికి కూడా సాయం అందిస్తుంటారు. ఓ పక్క ఎన్నికల హడావిడీలో బిజీ బిజీగా గడుపుతున్న కేటీఆర్.. తాజాగా ఎక్స్‌లో ఓ చిన్నారి అడిగిన ప్రశ్నకు స్పందించారు.
‘కేటీఆర్ మామా.. హైదరాబాద్‌కు డిస్నీ ల్యాండ్ తీసుకొని రా ప్లీజ్’ అంటూ ఓ చిన్నారి తన కోరికను తెలిపింది. ఈ వీడియోను ఆమె తండ్రి సురేంద్ర వినాయకం ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ వీడియోపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘ప్రామిస్ చేయలేను కానీ బేటా.. తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేస్తాను’ అంటూ సదరు చిన్నారికి రిప్లై ఇచ్చారు.