తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కోనసీమ జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా లోకేశ్ ఆక్వా రైతులతో సమావేశమయ్యారు. ఆక్వా రైతులు తమ సమస్యలను లోకేశ్ కు వివరిస్తూ వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా లోకేశ్ స్పందిస్తూ… ఆక్వా రైతులను జగన్ ప్రభుత్వం దారుణంగా దెబ్బతీసిందని అన్నారు. జగన్ పాలనలో ఆక్వా హాలిడే ప్రకటించాల్సిన తీవ్ర పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు.
టీడీపీ అధికారంలోకి వస్తే ఆక్వా రైతులకు సమస్యలు లేకుండా చేస్తామని…. సీడ్, ఫీడ్, కరెంటు చార్జీలు తగ్గేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆక్వా ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు.