తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీ జోరుగా ప్రచారం చేస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అనేక నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాగా, జనసేన జెండాలతో కళాకారులు చేపట్టిన ప్రదర్శన తాలూకు వీడియోను పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. తీన్ మార్ డప్పులకు అనుగుణంగా కళాకారులు జెండాలను ఊపుతూ అలరించారు. ఈ ప్రదర్శన ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని పేర్కొన్నారు. కళాకారుల ప్రదర్శనకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను అంటూ వివరించారు.