తెలంగాణ వీణ , హైదరాబాద్ : కంటోన్మెంట్ నియోజకవర్గంలో చివరి రోజు, ఎన్నికల ప్రచారంలో భాగంగా, కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని 150వ డివిజన్ లోని, అంబేద్కర్ నగర్ లో స్థానిక కార్పొరేటర్ కొంతం దీపిక నరేష్ తో కలిసి, శ్రీ గణేష్ ఇంటింటి ప్రచారం నిర్వహించి, కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని బస్తి వాసులను శ్రీ గణేష్ కోరారు.
కంటోన్మెంట్ బిజెపి అభ్యర్థి శ్రీ గణేష్ కు బస్తివాసులు, మహిళలు హారతులు పట్టి, శాలువాలతో ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీ గణేష్ మాట్లాడుతూ… కంటోన్మెంట్ లోని బస్తీ వాసులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఉన్నారు.
కంటోన్మెంట్ అభివృద్ధి బిజెపితోనే సాధ్యం అని చెప్పారు. తనను గెలిపిస్తే బస్తీలను అభివృద్ధిచేసే బాధ్యతను తీసుకుంటానని ప్రజలకు హామీ ఇచ్చారు.