తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేస్తుండడం పట్ల ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఘాటుగా స్పందించారు. “పదేళ్ల నుంచి రాజకీయాలు చేస్తున్నావు నువ్వు రాజకీయ నాయకుడివా, లేక రాజకీయ నటుడివా లేకపోతే రాజకీయ విటుడివా లేక రాజకీయ బ్రోకరువా అంటూ ధ్వజమెత్తారు.
అసలు నీ వ్యక్తిత్వం ఏంటి? నీ వ్యవహారం ఏంటి? ఇవాళ తెలంగాణలో ఏం జరుగుతోంది? తెలంగాణ రాజకీయాల్లో నీ పాత్ర ఏంటి? తెలంగాణలో నువ్వు ఎవరికి మద్దతు ఇస్తున్నావ్? చంద్రబాబు ఎవరికి మద్దతు ఇస్తున్నాడు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తున్న పార్టీలు ఏంటి ఒకటి బీఆర్ఎస్ మరొకటి బీజేపీ. కాంగ్రెస్ పార్టీని బీజేపీ, బీఆర్ఎస్ సవాల్ చేస్తుంటే నీ జెండా ఎక్కడ కట్టావ్… బీజేపీ పక్కన కట్టావ్. మరి చంద్రబాబు జెండా ఎక్కడ కట్టాడు కాంగ్రెస్ పక్కన కట్టాడు. ఏం బతుకులయ్యా మీవి చంద్రబాబేమో ఇంట్లో కూర్చుంటాడు… కాంగ్రెస్ మీటింగులు జరుగుతుంటే వాటిల్లో పచ్చ జెండాలు పైకి లేస్తుంటాయి. బీజేపీలో ఏమో నువ్వు డైరెక్టుగా వెళ్లి జెండాలు కట్టి కూర్చున్నావు.
అక్కడ ఆ నాటకం ఏపీలో ఏమో ఈ నాటకం. మీ బతుకులేంటని అడుగుతున్నా. ఇంత నీచమైన రాజకీయాలు చేసేది చంద్రబాబు అయితే, ఆయనను కూడా మించిపోయిన వ్యక్తి పవన్ కల్యాణ్. మీరు రాజకీయాలు చేస్తున్నారా, లేక రాజకీయ వ్యభిచారం చేస్తున్నారా? అక్కడ బీజేపీ, ఇక్కడ టీడీపీ! నువ్వు బీజేపీకి సెకండ్ సెటప్పువా… లేక ఇక్కడ టీడీపీకి సెకండ్ సెటప్పువా! అసలు నీ బ్రతుకేంటి? ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.