తెలంగాణ వీణ , హైదరాబాద్ : హైదరాబాద్లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. పాతబస్తీలో బడా వ్యాపారులే లక్ష్యంగా శనివారం తెల్లవారుజామునుంచే ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. కోహినూర్ గ్రూప్స్ ఎండీ మజీద్ఖాన్ ఇళ్లు, కార్యలయాల్లో విస్తృతంగా తనిఖీలు జరుపుతున్నారు. షానవాజ్ ఇంటితోపాటు పలువురు ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు.
కింగ్స్ ప్యాలెస్ యజమానుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. కోహినూర్, కింగ్స్ గ్రూపుల పేరుతో ఫంక్షన్ హాల్స్, హోటల్స్ నిర్వహిస్తున్న ఈ వ్యాపారులు ఓ రాజకీయ పార్టీకి పెద్ద మొత్తంలో డబ్బులు సమకూర్చుతున్నట్లు అనుమానం రావడంతో దాడులకు దిగారు.