తెలంగాణ వీణ . ఏపీ బ్యూరో : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు అర్హులందరికీ చేరేలా ప్రజా ప్రతినిధులు, అధికారులు చొరవ చూపాలని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. గుంటూరులో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర సభలో ఆయన మాట్లాడుతూ, లబ్ధిదారుల అనుభవాలు తెలుసుకుని పథకాలు మెరుగ్గా ఉండేటట్లు చూడాలన్నారు.