Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

తెలంగాణ ప్రజలకు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

Must read

తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. బీజేపీ-బీఆర్‌ఎస్‌లు కుమ్మకు రాజకీయాలతో మభ్యపెట్టాలని చూస్తున్నాయని.. ప్రజలు ఇది గమనించి ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పాలని లేఖలో కోరారాయన. 

‘‘బీజేపీ-బీఆర్‌ఎస్‌లు కుమ్మక్కు అయ్యాయి. కాంగ్రెస్‌ నేతల ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు చేయిస్తున్నాయి. అత్యున్నత ప్రభుత్వ సంస్థల్ని.. రాజ్యాంగబద్ధ వ్యవస్థల్ని మోదీ, కేసీఆర్‌లు రాజకీయ క్రీడలో పావులుగా మార్చారు. ఆ రెండు పార్టీలో  చేరినవాళ్లు పవిత్రులు.. ఇతర పార్టీలో చేరి ప్రజల తరఫున పోరాడితే వాళ్లు ద్రోహులా?. అటు దేశంలో.. ఇటు రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలు లేకుండా  చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండకూడదు… ప్రశ్నించే గొంతులే మిగలకూడదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇది బీజేపీ-బీఆర్‌ఎస్‌ మధ్య కుదిరిన కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రాం ఇది’’ అని లేఖలో పేర్కొన్నారయన. 

కాంగ్రెస్ గెలుపు అవకాశాలు పెరుగుతున్న కొద్దీ… ఈడీ, ఐటీ దాడులూ పెరుగుతున్నాయి. అమిత్ షా – కేసీఆర్ కలిసి ప్రణాళిక రచించడం. పీయూష్ గోయల్, కేటీఆర్ కలిసి దానిని అమలు చేయడం… ఇదే కదా జరుగుతున్నది!. ప్రతి రోజు సూర్యుడు అస్తమించగానే.. వీళ్ల కుట్రలకు పథక రచన జరుగుతోంది. కేసీఆర్కు వందల కోట్ల విరాళాలు ఇచ్చిన వ్యక్తుల జోలికి ఆ సంస్థలు వెళ్లవు. కాళేశ్వరం కుంగి అవినీతి బట్టబయలైతే ఆ సంస్థలు కేసీఆర్ ను ప్రశ్నించవు. కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పొంగులేటి, కేఎల్ఆర్, తుమ్మల ఇళ్లపై.. తాజాగా వివేక్ వెంకట స్వామి ఇళ్లు, కార్యాలయాలపై మాత్రం విరుచుకుపడుతున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you