తెలంగాణ వీణ, మెదక్ : వెల్దుర్తి మండలం శెట్టిపల్లి రామయ్య పల్లి ఎద్దులపల్లి వెల్దుర్తి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆవుల రాజిరెడ్డిని గెలిపించాలని ఆయన సతీమణి శైలజ రాజిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టే ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితేనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలకు వివరించారు. ప్రజలు గత పది సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గ్రామాలలో తిరుగుతుంటే సమస్యలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని శైలజ రాజిరెడ్డి అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ద్వారానే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఆమె అన్నారు. చెయ్యి గుర్తుపై ఓటు వేసి తన భర్త రాజిరెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో. రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్ మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి మహిళా మండల అధ్యక్షురాలు శ్వేతా వెంకటరెడ్డి సీనియర్ నాయకుడు పోతిరెడ్డి అన్వేష్ కలాల్ శేఖర్ గౌడ్ వెల్దుర్తి టౌన్ అధ్యక్షుడు మహేష్ కాంగ్రెస్ జిల్లా నాయకుడు నరేందర్ రెడ్డి వెంకటరెడ్డి సుదర్శన్ శేఖర్ మధు సింహం గణేష్ గడ్డమీది నాగరాజ్ గోగుల కృష్ణ మాజీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు సుదర్శన్ శంకర్ షఫీ ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Tweetప్రచారం లో పాల్గొన్న ఆవుల రాజిరెడ్డి సతీమణి.. pic.twitter.com/QgCvhhH60V
— GS9TV Telugu News (@Gs9tvNews) November 23, 2023