తెలంగాణ వీణ, సికింద్రాబాద్ : భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి మేకల సారంగపాణి కి మద్దతుగా కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు..వారాసిగుడ కూడలి నుండి చిలకల గూడ వరకు పెద్ద ఎత్తున రోడ్ షో చేసి భాజపా అభ్యర్థి సారంగపాణి నీ గెలిపించాలని కోరారు..గత 9 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను నమ్మించి మోసం చేశారని అన్నారు..రెండు పడక గదుల ఇళ్ల,దళిత బందు,బిసి బందు పేదలకు అందిన దాఖలాలు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు.. భారాసా ప్రభుత్వం వైఖరితో ప్రజలు విసిగిపోయి ఉన్నారని ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకత తమకు అనుకూలంగా మారనుందని,సికింద్రాబాద్ లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని అన్నారు..
Tweetసికింద్రాబాద్ రోడ్ షో లో పాల్గొన్న కిషన్ రెడ్డి pic.twitter.com/zNo1p2EFgk
— GS9TV Telugu News (@Gs9tvNews) November 23, 2023