తెలంగాణ వీణ, సికింద్రాబాద్ : బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తిగుళ్ల పద్మారావు గౌడ్ బౌద్ధ నగర్ డివిజన్లో విస్తృతంగా పార్టీ ప్రచార కార్యక్రమం స్థానిక కార్పొరేటర్ల నాయకులు కార్యకర్తలు ప్రజలతో కలిసి నిర్వహించారు. అడుగడుగున పద్మారావు గౌడ్ కి స్థానిక ఓటర్లు నీరాజనాలు పలికారు. మంగళ హారతులు ఇస్తూ శాలువాలతో సన్మానిస్తూ మా ఓటు కారు గుర్తుకే బిఆర్ఎస్ పార్టీకే అంటూ సంతోషాన్ని వ్యక్తపరిచారు. పద్మారావు గౌడ్ మాట్లాడుతూ సికింద్రాబాద్ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో హ్యాట్రిక్ కైవసం చేసుకోవడం ఖాయమని వేల కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి అగ్రస్థానంలో నిలిపామని అభివృద్ధిని చూపించి ఓటు అడిగే హక్కు బిఆర్ఎస్ ప్రభుత్వం తరఫున తనకే ఉందని ఆశాభావం వ్యక్తపరిచారు. ఈనెల 25వ తేదీన జరగబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ బహిరంగ సభకు సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి భారీ జన సమీకరణతో వెళ్తామని అన్నారు.
Tweetపద్మారావు గౌడ్ కు మంగళ హారతులతో నీరాజనాలు పలికిన మహిళలు.. pic.twitter.com/o35X4RZnzw
— GS9TV Telugu News (@Gs9tvNews) November 23, 2023