తెలంగాణ వీణ, సికింద్రాబాద్ : కంటోన్మెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వెన్నెల గద్దర్ మోండా మార్కెట్ డివిజన్ పరిధిలోని రెజిమెంటల్ బజార్ ప్రాంతంలో విస్తృతంగా నియోజకవర్గం పార్టీ ఇంచార్జ్ కర్ణాటక ఎమ్మెల్యే నైనా మోతావా తో పాటు స్థానిక నాయకులు కార్యకర్తలు ప్రజలతో కలిసి పార్టీ ఆరు గ్యారంటీలను వివరిస్తూ హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ముందుగా గద్దర్ పాడిన పోరు తెలంగాణ పాట స్వయంగా అభ్యర్థి పాడి అక్కడ ఉన్న ప్రజలను ఆకట్టుకున్నారు. వెన్నెల గద్దర్ మాట్లాడుతూ ఆత్మ బలిదానాలు, అమరవీరుల త్యాగాలు, జేఏసీ నాయకుల పోరాటాలు, పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో దొరల గడీలో ప్రజలు బందీ అయి ఉన్నారని పోరాట యోధుడు గద్దర్ స్ఫూర్తితో తెలంగాణ ప్రజలకు విముక్తి కావాలంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రావాలి అని పిలుపునిచ్చారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉన్న దళిత సామాజిక వర్గాన్ని బిఆర్ఎస్ బిజెపి పార్టీలు ఎప్పుడు పట్టించుకోలేదని కంటోన్మెంట్లో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రావాలి అని ఆమె అన్నారు.
Tweetసికింద్రాబాద్ లో వెన్నెల గద్దర్ ప్రచారం pic.twitter.com/pnA767BMUM
— GS9TV Telugu News (@Gs9tvNews) November 23, 2023
వెన్నెల గద్దర్ కు మద్దతుగా కర్ణాటక ఎమ్మెల్యే నైనా మోతావా..
Tweetసికింద్రాబాద్ లో వెన్నెల గద్దర్ ప్రచారం pic.twitter.com/ifK7Y9IUDo
— GS9TV Telugu News (@Gs9tvNews) November 23, 2023