Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

చైతూ బైర్త్ డే స్పెషల్ గా ‘తండేల్’ ఫస్టు లుక్ రిలీజ్!

Must read

తెలంగాణ వీణ , సినిమా : నాగచైతన్య – చందూ మొండేటి కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘సవ్యసాచి’ ఆశించిన స్థాయిలో ఆడలేదు. చైతూకి తప్పకుండా ఒక హిట్ ఇస్తానని చెప్పిన చందూ మొండేటి, ఆయనతో ఓ సినిమా చేస్తున్నాడు  .. ఆ సినిమా పేరే ‘తండేల్’. మత్స్యకారుల జీవితం నేపథ్యంలో నడిచే కథ ఇది. మత్స్యకారుడిగానే ఈ సినిమాలో చైతూ కనిపించనున్నాడు. 

మత్స్య కారుల జీవితాలు ఎలా ఉంటాయి? వాళ్ల పద్ధతులు .. నమ్మకాలు .. మాట తీరు ఎలా ఉంటాయనే విషయంపై చైతూ కొంత స్టడీ చేశాడు. ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా సాయిపల్లవి కనిపించనుంది. ‘లవ్ స్టోరీ’ హిట్ తరువాత ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా కావడంతో, సహజంగానే అంచనాలు ఉంటాయి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you