తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. ప్రొద్దుటూరుకు చెందిన నిరుపేద విద్యార్థిని వాచ్చల్య శ్రీ ఉన్నత చదువు చదుకోవాలనే కోరికను ఎమ్మెల్యే తీర్చారు.
రష్యాలో ఎంబీబీఎస్ సీటు వాచ్చల్య శ్రీ సాధించగా, రష్యాలో ఆమె చదువుకయ్యే సుమారు రూ.50 లక్షల ఖర్చును ఎమ్మెల్యే భరించి చదివించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ, కుటుంబంలో ఒక్కరు చదువుకుంటే ఆ కుటుంబం బాగుపడుతుందన్నారు.