తెలంగాణ వీణ , హైదరాబాద్ : రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అని తనను గెలిపిస్తే మంత్రిగా తిరిగి వచ్చి అభివృద్ధి చేస్తా అని ఎమ్మెల్యే అభ్యర్థి ధనసరి సీతక్క అన్నారు. మంగళవారం మండలంలోని నారాయణపూర్, రామారావుపల్లి, వెంకటేశ్వర్లపల్లి, బుర్గుపేట, రామకృష్ణాపూర్, ఆనందపూర్, పట్వారుపల్లి, లక్ష్మీదేవిపేట గ్రామాల్లో సీతక్క ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎంత మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చి బీఆర్‌ఎస్ తరఫున ప్రచారం చేసి రూ.కోట్లు ఖర్చు చేసిన ములుగులో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమన్నారు. తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు నాయిని భరత్ సీతక్కకు మద్దతు పలికి ప్రచారంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి, పీసీసీ సభ్యుడు మల్లాడి రాంరెడ్డి, మండలాధ్యక్షుడు సుర్యనారాయణ, నాయకులు బండి శ్రీనివాస్, అయిలయ్య, రవి పాల్గొన్నారు.