తెలంగాణ వీణ , హైదరాబాద్ : కర్ణాటక ప్రజలు, రైతులు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే.. ఐదు గంటల కరెంటే ఇస్తున్నారు.. తెలంగాణలో కూడా కాంగ్రెస్‌కు ఓటేస్తే మన గతి కూడా అంతే అయితది అని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. తాండూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని, పైలట్ రోహిత్ రెడ్డికి మద్దతుగా ప్రసంగించారు.
రైతుబంధు తప్పకుండా ఉంటది.. ఉండుడే కాదు. రేపు రోహిత్ రెడ్డి గెలిస్తే 10 వేలనుంచి 16 వేలకు పోతది. రోహిత్ గెలిస్తేనే ఉంటది. కత్తి ఒకరికి ఇచ్చియుద్ధం ఇంకొకరిని చేయమంటే ధర్మం కాదు కదా..? రైతుల పక్షాన, ప్రజల పక్షాన ఉండే వారి చేతిలో కత్తి పెడితేనే వాళ్లు మిమ్మల్ని కాపాడుతారు. 24 గంటల కరెంట్ ఉంటది రోహిత్ రెడ్డి గెలిస్తేనే లేదంటే కరెంట్ ఆగమైపోతది. కాబట్టి మీరు రోహిత్‌కు ఓటేయాలి.
ఇంకో డేంజర్ మాట చెబుతున్నారు కాంగ్రెసోళ్లు. వీఆర్వోల రాజ్యం, ప్రభుత్వం చేతిలో రైతుల బతుకు ఉండే. ఇప్పుడు మీ బొటనవేలు పెడితేనే భూ యజమాన్యం మారుతది. ముఖ్యమంత్రికి కూడా ఆ అధికారం లేదు. ప్రభుత్వం మీకు ధారపోసిన ఆ అధికారాన్నిపొడగొట్టుకుంటారా..? కాపాడుకుంటారా..? అనేది మీరే నిర్ణయించుకోవాలి అని కేసీఆర్ సూచించారు.