తెలంగాణ వీణ , సినిమా : ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై హారర్ నేపథ్యంలో వెబ్ సిరీస్ లకు మంచి ఆదరణ లభిస్తోంది. కంటెంట్ కనెక్ట్ కావాలేగానీ, రికార్డుస్థాయి వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్ నుంచి మరో హారర్ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. ఆ వెబ్ సిరీస్ పేరే ‘ది విలేజ్’. హీరో ఆర్య ప్రధానమైన పాత్రగా రూపొందిన ఈ సిరీస్ ఈ నెల 24 నుంచి ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
హీరో తన ఫ్యామిలీతో కలిసి సరదాగా రోడ్ ట్రిప్ కి వెళతాడు. ఒక రాత్రివేళ ఒక విలేజ్ దగ్గరికి రాగానే కారు ట్రబుల్ ఇస్తుంది. ఫ్యామిలీని కారులోనే ఉండమని చెప్పి, సహాయం కోసం హీరో ఆ ఊళ్లోకి వెళతాడు. ఆ ఊరు ఎంత ప్రమాదకరమైనదనే విషయం అతనికి తెలియదు. అతను తిరిగి వచ్చేసరికి ఫ్యామిలీ అదృశ్యమవుతుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? అనేదే కథ.