తెలంగాణ వీణ, ఓయూ : ఓయూ ఎంబీఏ కాలేజ్ లో ఘనంగా ట్రెడిషనల్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులైన లుంగీ లు, దోతీలు, ధరించి క్యాట్ వాక్ చేశారు. అదేవిధంగా అమ్మాయిలు చీరలు, లంగా వోణీలు ధరించి సందడి చేశారు. సాంప్రదాయ పాటలకు నృత్యాలు చేసి వేడుకగా ట్రెడిషనల్ సెలబ్రేషన్స్ ను జరుపుకున్నారు. ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ హెడ్, ప్రిన్సిపల్ ప్రొ. డి. శ్రీరాములు మాట్లాడుతూ భారతీయ సంస్కృతి ఎంతో గొప్పదని మనం ఎంత ఎత్తుగా ఎదిగిన ఏ స్థాయిలో ఉన్న మూలాలను మరిచిపోవద్దని లక్ష్యంతో ట్రెడిషనల్ డే సెలబ్రేషన్స్ ను ఘనంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. తమ కాలేజ్ లో వంద శాతం ప్లేస్ మెంట్స్ ఇస్తున్నామని పేర్కొన్నారు. అత్యధికంగా ఈ సంవత్సరం 24 లక్షల ప్యాకేజీ తమ విద్యార్థికి రావడం గర్వించదగ్గ విషయం అన్నారు. దీనికి సమిష్టి కృషి మార్గదర్శకత్వం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రొఫెసర్లు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
Tweetఓయూ ఎంబీఏ కాలేజ్ లో ఘనంగా ట్రెడిషనల్ డే సెలబ్రేషన్స్ pic.twitter.com/jYq2eYU4OB
— GS9TV Telugu News (@Gs9tvNews) November 21, 2023