తెలంగాణ వీణ, సికింద్రాబాద్ : కాంగ్రెస్, బీజేపీలు ముస్లింలను వంచించాయని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ మండిపడ్డారు. మైనార్టీలకు అన్నివిధాల అండగా నిలిచింది బీఆర్ఎస్సేనని స్పష్టం చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గ అభివ్రుద్ధి కోసం దివంగత ఎమ్మెల్యే సాయన్న ఎంతో క్రుషి చేశారని కొనియాడారు. అందుకే కంటోన్మెంట్ ప్రజలంతా కారుకే మద్దతు పలుకుతున్నారని… బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందిత గెలుపు ఖాయమని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బోయిన్ పల్లి తెలంగాణ గార్డెన్స్ లో నిర్వహించిన ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశానికి హోంశాఖ మంత్రి మహమూలీ విచ్చేశారు. మైనార్టీలకు దిశానిర్దేశం చేశారు. ముస్లింలంతా సీఎం కేసీఆర్ వెంటే ఉండాలని సూచించారు.