తెలంగాణ వీణ, సికింద్రాబాద్: సికింద్రాబాద్ నియోజకవర్గం లో బీ ఆర్ ఎస్ అభ్యర్ధి, డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ కు వివిధ వర్గాల నుంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో సికింద్రాబాద్ పద్మశాలి సంఘం పద్మారావు గౌడ్ కు ఎన్నికల్లో మద్దతును ప్రకటించింది. సికింద్రాబాద్ నియోజకవర్గం లోని ఆయిదు మునిసిపల్ డివిజన్ల పరిధులలో తమ అనుబంధ సంఘాలు బీ ఆర్ ఎస్ అభ్యర్ధి పద్మారావు గౌడ్ కు అనుకూలంగా మద్దతునిస్తాయని సంఘం అధ్యక్షుడు కే.ఒడియన్ శ్రీనివాస్, కార్యదర్శి ఆదేపు రవి, కోశాధికారి అంకెం శ్రీకాంత్, నేతలు మంద జగన్, సీ హెచ్ మల్లేష్ లు ఓ ప్రకటనలో తెలిపారు. పద్మారావు గౌడ్ భారీ అడిక్యతతో విజయం సాధించేందుకు తమ సంఘం సహకరిస్తుందని పేర్కొన్నారు. కాగా పద్మశాలి సంఘం తనకు పూర్తి మద్దతు తెలుపుతూ తీర్మానించడం పట్ల పద్మారావు గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. వారి అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.