తెలంగాణ వీణ,మల్కాజిగిరి: ప్రముఖ సినీ నటి, తమిళనాడు బీజేపీ నాయకురాలు ఖుష్బూ మల్కాజిగిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి ఎన్ రామచంద్రరావుకు మద్దతుగా ఆమె ప్రచారంలో పాల్గొన్నారు. యాప్రాల్ చౌరస్తా నుంచి ఆమె ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి బీజేపీ అభ్యర్థి రామచంద్రరావును భారీ మెజార్టీ తో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు, యాప్రాల్ ప్రాంతంలో తమిళ ఓటర్లు అధికంగా ఉండటంతో సినీ నటి కుష్బూ మల్కాజిగిరి బిజెపి అభ్యర్థి రామచద్రరావు కు తమ ఓటును వెయ్యాలని స్థానిక ప్రజలను ఉద్దేశించి తమిళ్ లో ప్రసంగించారు.