తెలంగాణవీణ, కాప్రా : ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని మీర్పేట్ హెచ్ బీ కాలనీడివిజన్ లోని పలు కాలనీల్లో కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డిలు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తోన్నారు. బండారి లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థిస్తూ గడప గడపకు ప్రచారం చేశారు. కాలనీవాసులను అప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కార దిశగా కృషీ చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమ పథకాలను వివరిస్తూ, బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. కాలనీవాసులు ఆసరా పెన్షన్, షాది ముబారక్ లాంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. కాలనీవాసుల నుండి వచ్చే ఆదరణ చాలా సంతోషాన్ని ఇస్తున్నాయని తెలిపారు. బస్తీ దావాఖన సేవలు, ఉచిత మందులు దేశానికే గర్వకారణం అన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణులకు పౌష్టికాహారం, పాఠశాలలోని విద్యార్థులకు అల్పాహారం, ఆసరా పించన్, బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ప్రజలకు వివరిస్తూ రూ.400/- లకే గ్యాస్ సిలిండర్, సౌభాగ్యలక్ష్మి, ప్రతి ఇంటికీ రూ.15 లక్షల వరకు ఆరోగ్య భీమా ఇలా ఎన్నో రకాల సంక్షేమ పథకాలు ఉన్నాయని, అభివృద్ధి, సంక్షేమ పథకాలే మా అస్త్రాలుగా ముందుకు వెళ్తామని అన్నారు. ఉప్పల్ నియోజకవర్గ ప్రజల ఆదరణ, ఆశీర్వాదంతో అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి గారి గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తామని దానికీ తగిన విధంగా కృషి చేస్తామని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో కాలనీ నాయకులు సుఖేందర్ రెడ్డి, ముత్యంరెడ్డి, దేవేందర్, వెంకట్ రెడ్డి, సత్యనారాయణ, కాళిదాసు, నవీన్, యాదిరెడ్డి మరియు డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నా