తెలంగాణ వీణ, సికింద్రాబాద్ : లాలాపేట లో బీ ఆర్ ఎస్ తార్నాక డివిజన్ ఎన్నికల కార్యాలయాన్ని డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యకర్తల నిరంతర శ్రమ తో తాము అద్బుత విజయాన్ని సాధించానున్నామని తెలిపారు. వివిధ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు తమను సునాయాసంగా గెలిపిస్తాయని, మెజారిటీ పెంచుకోవాలని భావిస్తున్నామని అన్నారు. సితాఫలమండీ ప్రభుత్వ కుట్టి వెల్లోడి ఆసుపత్రిని వంద పడకల స్థాయికి పెంచి కొత్త భవనాల నిర్మాణానికి రూ. 11.75 కోట్ల నిధులతో పనులు ప్రారంభించమని, ఇప్పటికే సికింద్రాబాద్ నియోజకవర్గంలో రవీంద్రనగర్, చింతబావి, దుడ్ బావి, ఇందిరానగర్, తార్నాక, అంబర్ నగర్ ప్రాంతాల్లో బస్తీ దవాఖానా లను నెలకొల్పామని అన్నారు. లాలాపేట, అడ్డగుట్ట ప్రాంతాల్లో రూ.41 కోట్ల ఖర్చుతో రెండు ఆసుపత్రులకు కొత్త భవనాలను నిర్మించే పనులు ప్రారంభించమని వివరించారు. లాలాపేట, అడ్డగుట్ట లో ఫంక్షన్ హాల్స్ పనులు చురుకుగా సాగుతున్నాయని, లాలాపేట లో స్విమ్మింగ్ పూల్ ను నిర్మించిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు. డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.