తెలంగాణ వీణ ,సినిమా ; పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సలార్. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఎన్నో వాయిదాల తరువాత ఈ సినిమా డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాపైనే ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. అందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి.. ఆదిపురుష్ తో హిట్ అందుకుంటాడు అనుకున్న డార్లింగ్.. డిజాస్టర్ ను అందుకున్నాడు. దీంతో సలార్ హిట్ అందుకుంటే.. ప్రభాస్ ఖాతాలో హిట్ పడుతుంది. ఇంకొకటి బాహుబలి తరువాత అంతటి హిట్ ప్రభాస్ అందుకున్నదే లేదు. అందుకే.. ఆ రికార్డ్ నుసలార్ బద్దలుకొడుతుందని అభిప్రాయపడుతున్నారు. దీనికోసమే డార్లింగ్ ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా.. మేకర్స్ లో అస్సలు చలనం లేదు. ఫ్యాన్స్ అందరూ.. అడగగా.. అడగగా.. సలార్ ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఒక సినిమా ప్రేక్షకుల్లోకి వెళ్లాలంటే.. ప్రమోషన్స్ ఓ రేంజ్ లో ఉండాలి. ఇంకా సలార్ రిలీజ్ కు పట్టుమని నెల కూడా లేదు.. అయినా ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది లేదు. ఇప్పటివరకు షూటింగ్ కూడాపూర్తికాలేదు. డైనోసర్ అమెరికా వెళ్ళాడు.. వచ్చిన వెంటనే ప్రమోషన్స్ అని చెప్పారు. కానీ, ప్రభాస్ రాగానే కాకినాడ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. వచ్చిన అవుట్ ఫుట్ ను చూసి ప్రశాంత్ హ్యాపీ గా లేకపోవడంతో మరోసారి రీ షూట్ చేయడం వలన ఇంత టైమ్ పడుతున్నదని కొందరి వాదన. ఇలాంటి పాన్ ఇండియా సినిమాకు ప్రమోషన్స్ కు ఎంత ఎక్కువ టైమ్ తీసుకుంటే అంత మంచిది. మరి ఇంకా షూటింగ్ కూడా పూర్తికాకుండా సలార్ టీమ్ ప్రమోషన్స్ ఎప్పుడు మొదలుపెడతారు.. ? ఏంటి.. ? అనేది తెలియాల్సి ఉంది.