Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

ఆ కటౌట్ కి ఆ మాత్రం ఖర్చు పెట్టొచ్చు…

Must read

తెలంగాణ వీణ ,సినిమా : బాహుబలి తర్వాత అన్నీ భారీ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు ప్రభాస్. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు భారీ బడ్జెట్‌తో తెరకెక్కాయి. ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ నష్టాన్ని మిగిల్చాయి. ప్రజెంట్ సెట్స్ పై ఉన్న సినిమాల్లో సలార్ 250 నుంచి 300 కోట్లు… కల్కి దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో పాన్ వరల్డ్ రేంజ్‌లో తెరకెక్కుతోంది. అయితే.. ఈ భారీ ప్రాజెక్ట్స్ మధ్యలో మారుతితో ఓ సినిమా కమిట్ అయ్యాడు డార్లింగ్. మొదట్లో… అసలు మారుతితో ప్రభాస్ సినిమా చేయడం ఏంటి? అనే కామెంట్స్ వినిపించాయి కానీ అన్నీ భారీ ప్రాజెక్స్ట్ కాబట్టి… మధ్యలో మీడియం రేంజ్ బడ్జెట్‌తో ఈ సినిమా చేస్తున్నాడని వినిపించింది. అలాగే… కేవలం తెలుగు ఆడియెన్స్ కోసం ప్రభాస్ ఈ సినిమా చేస్తున్నాడని అన్నారు. ప్రభాస్ పారితోషికమే ఈ సినిమాకు హెయెస్ట్ బడ్జెట్ అనుకునరుఇప్పుడు ఈ సినిమా లెక్కలు కూడా భారీగా మారుతున్నాయి, బడ్జెట్ ఎక్కువ పెడుతున్నారనే షాకింగ్ న్యూస్ వైరల్‌గా మారింది. కేవలం వీఎఫ్ఎక్స్ వర్క్ కోసమే దాదాపు 150 కోట్లు వరకు ఖర్చు పెడుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా… ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 300 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇందులో నిజమెంతో తెలియదు గానీ మారుతి ప్రాజెక్ట్ కూడా ప్రభాస్ రేంజ్‌లోనే పాన్ ఇండియా లెవల్లో ఆడియన్స్ ముందుకి వస్తున్నట్లు ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు. ఇప్పటికే చాలావరకు షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా నుంచి… ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ బయటికి రాలేదు. మారుతి మాత్రం ప్రభాస్‌ క్యారెక్టర్‌ను అదిరిపోయేలా రాసుకున్నట్టు టాక్ ఉంది. మరి ఫ్యాన్స్ కోసం ఒక్క గిఫ్ట్ ని న్యూ ఇయర్ లోపు ఇస్తారేమో చూడాలి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you