తెలంగాణ వీణ , హైదరాబాద్ : సీఎం కేసీఆర్ పాలనతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 స్థాయికి చేరిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. తాము రాష్ట్ర సాధన కోసం ఎంత నిజాయితీగా పనిచేశామో, రాష్ట్ర సాధన అనంతరం అభివృద్ధి పనుల్లో కూడా అంతే నిజాయితీతో పని చేస్తున్నామని ఆయన చెప్పారు బుధవారం ఉదయం టీయూడబ్ల్యూజే బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. బీఆర్‌ఎస్ పార్టీ పట్టణాలతో సమానంగా పల్లెలను కూడా అభివృద్ధి చేసిందని చెప్పారు. ఒకప్పుడు ప్రజలు పల్లెల నుంచి పట్టణాలకు వలస పోతే ఇప్పుడు పట్టణాల నుంచి పల్లెలకు వలస పోతున్నారని అన్నారు.
సీఎం కేసీఆర్ రాజీలేని పాలన కొనసాగిస్తున్నారని, ఆయన పాలనా దక్షతతో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో నెంబర్ 1గా కొనసాగుతున్నదని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. కేంద్రం ఇచ్చే పల్లె, పట్టణ ప్రగతి అవార్డుల్లో కూడా తెలంగాణ రాష్ట్రమే ఎక్కువ అవార్డులను దక్కించుకుందని తెలిపారు. అభివృద్ధి సంక్షేమంలో మనం దేశంలోనే నెంబర్ 1 అన్నారు.