తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ కేసులో అదనపు అఫిడవిట్ దాఖలు చేస్తామని కోర్టును సీఐడీ తరపు న్యాయవాది కోరారు. దీంతో, విచారణను హైకోర్టు మధ్యాహ్నానికి వాయిదా వేసింది. మధ్యాహ్నం 2.15 గంటల తర్వాత తదుపరి విచారణను చేపడతామని చెప్పింది.