తెలంగాణ వీణ , హైదరాబాద్ : కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఏమో గానీ ఆరు నెలల కొకసారి సీఎం మారటం మాత్రం పక్కా అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. తాజ్ డెక్కన్ హోటల్‌లో మంగళవారం జరిగిన తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్(టీబీఎఫ్) సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కొంతమంది గిట్టని వాళ్ళు మేము ఓడిపోవాలని కోరుకునే వాళ్ళు ఈ తొమ్మిదేళ్లలో కేసిఆర్ ఏం చేయలేదు అని మాట్లాడుతుంటారు. కానీ కేసిఆర్ ప్రజల మనిషి
స్థిరమైన ప్రభుత్వం, దృఢమైన నాయకత్వం ఉన్నప్పుడే అభివృద్ది సాధ్యపడుతుంది. బోర్ కొట్టిందని ఎవరైనా ప్రభుత్వం మారాలని కోరుకుంటారా. అభివృద్ధి చేసేవాళ్లు మరికొంత కాలం ఉంటే తప్పేంటి. తొమ్మిదేళ్లలో మేం అసాధారణ విజయాలు సాధించాం. ఆరున్నర సంవత్సరాల మా పని తీరు, గత 65ఏళ్ల ప్రభుత్వాల పనితీరు మీరు గమనించారు. మూసీ నది సుందరీకరణ చేస్తాం అని కాంగ్రెస్ చెప్తోంది. మూసీ నది నాశనం చేసింది కాంగ్రెస్ కాదా?