తెలంగాణ వీణ , హైదరాబాద్ : సీఎం కేసీఆర్ తన రెండో విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ నల్లగొండ జిల్లాలోని హాలియాలో మధ్యాహ్నం ఒంటి గంటకు నాగార్జున సాగర్ బీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్ గెలుపును కాంక్షిస్తూ ప్రసంగిస్తారు. జనగామ జిల్లాలోని పాలకుర్తి నియోజవర్గం తొర్రూరులో ప్రజా ఆశీర్వాద సభలో మధ్యాహ్నం 2 గంటలకు పాల్గొననున్నారు. అనంతరం అలాగే రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు.