తెలంగాణ వీణ , హైదరాబాద్ : జిల్లాలోని నకిరేకల్ నియోజకవర్గం చిట్యాలలో బీఆర్‌ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు మద్దతుగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ రోడ్‌షో లో పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు జరుగనున్న ఈ కాక్రమానికి మంగళవారం చిట్యాలలో బీఆర్‌ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. నకిరేకల్ మండలం నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పార్టీ నాయకులు కోరారు. కార్యక్రమానికి నకిరేకల్ బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తితో పాటు పలువురు సీనియర్ నాయకులు హాజరవుతున్నారని తెలిపారు.